Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
ఈ తరుణంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణకు ఈరోజు కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్ హాజరయ్యారు. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌ను కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో 6.30గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఫోన్ చేశారు? ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారా ఇంకెవరికైనా ఫోన్ ఇచ్చారా? అనే అంశాలపై సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.