Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ తరుణంలో పలు కార్లు ఢీకొనడంతో కొందరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. హర్పాల్పూర్లోని బైతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అఖిలేష్ యాదవ్ వెళ్తున్నారు.
ఫర్హత్ నగర్ రైల్వే క్రాసింగ్ సమీపంలోని మలుపు వద్ద అఖిలేష్ యాదవ్ కాన్వాయ్‌లోని ఒక వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. వాటిలో ప్రయాణించిన కొందరు వ్యక్తులు గాయపడ్డారు. అంబులెన్స్‌లో వారికి చికిత్స అందించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అఖిలేష్ యాదవ్‌కు ఏమీ కాలేదు. అనంతరం ఆయన సురక్షితంగా కార్యక్రమం జరిగే ప్రాంతానికి వెళ్లారు.