Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో యథాతథస్థితి కొనసాగించాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే పేరిట బ్యాంకును మోసం చేశారన్న కేసులో ఈడీ అధికారులు నామా ఇంట్లో సోదాలు చేసి ప్రశ్నించడంతో పాటు పలు ఆస్తులను తాత్కాలిక జప్తు చేశారు. ఈడీ కేసు, ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ నామా నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాంచీ ఎక్స్ప్రెస్ హైవే వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నామా నాగేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో, ఛార్జిషీట్లో తన పేరు లేదని, మధుకాన్ గ్రూప్ సంస్థలకు తాను 2009లోనే నామా రాజీనామా చేసినట్టు తెలిపారు. వేధించడం కోసం దురుద్దేశ పూరితంగా ఈడీ కేసు పెట్టినట్టు తెలిపారు. నామా పిటిషన్పై వాదనలు వినిపించేందుకు ఈడీ గడువు కోరింది. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం కేసు విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథస్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది.