Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపాలెం
మంచుకొండ గ్రామపంచాయతీ పరిధిలో ఇల్లందు ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కామేపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన, బానోతు నగేష్ (27), కుసుమంచి మండల పరిధిలోని పెస్టిసైడ్స్ దుకాణం యందు ప్రయివేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
శుక్రవారం ఉదయం తెల్లవారుజామున, పెస్టిసైడ్స్ షాప్ యందు వెళుతుండగా మంచుకొండ సమీపంలో ఖమ్మం నుంచి ఏన్కూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో, తలకు తీవ్ర గాయాలయి, అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రఘునాథపాలెం ఎస్సై మాచినేని రవికుమార్ తెలిపారు.