Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అపోలో ఫార్మసీ ఎదురుగా కాసింహంపేట గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన బైక్‌ను నిలిపాడు. ఆ తర్వాత బైక్ కవర్లో రూ. 3 లక్షలను ఉంచి, అక్కడున్న ఓ దుకాణంలోకి వెళ్లాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ఓ నలుగురు మహిళలు ఆ బైక్‌పై కన్నేశారు. అటు, ఇటు తిరుగుతూ బైక్‌లో ఉన్న నగదు కవర్‌ను అపహరించారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపోలో ఫార్మసీ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో ఈ దొంగతనం దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ నలుగురు మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దొంగతనానికి పాల్పడింది బీహార్‌కు చెందిన మహిళలు అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.