Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు ధర్మాసనం ఈనెల 6న తీర్పు తెలుపనుంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి తీర్పునిచ్చారు.
సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు తెలుపనుంది.