Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. ఈ నెల 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగుతాయని..ట్రాఫిక్ ఛీఫ్ సుధీర్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే, ఈ నెల 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ మూసివేస్తామన్నారు. ఈ మార్గం లో వెళ్లాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పేర్కొన్నారు. అలాగే, ఈ నెల 5 నుంచి 7 వరకు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మూసివేయనున్నామని..తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై రాకపోకలకు అనుమతి ఉంటుందన్నారు.బస్ రూట్స్ లో కూడా డైవర్షన్స్ ఉంటాయి..ప్రజలు మెట్రో రైలు ప్రయాణం వినియోగించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను విరివిగా వాడుకోవాలని..లిబర్టి, అంబెద్కర్ విగ్రహం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, ఇగ్బాల్ మినార్ గుండా వెళ్లే వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాలన్నారు. నూతన సచివాలయ పనులకు ఆటంకం లేదు, పనులు యథావిధిగా జరుగుతాయని..ప్రజలు అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ కు సహకరించాలని కోరారు నగర ట్రాఫిక్ ఛీఫ్ సుధీర్ బాబు.