Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాడు విజయ్. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించింది సెవెన్ స్క్రీన్ స్టూడియో. తాజాగా సినిమాకు టైటిల్ ఫైనల్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'లియో' (LEO) టైటిల్‌ను ఫైనల్ చేశారు. Bloody Sweet అనేది ట్యాగ్‌లైన్. అనిరుధ్ స్టన్నింగ్ బీజీఎంతో లోకేశ్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో కట్ చేసిన ప్రోమో ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష, సాండీతోపాటు ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.