Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగర శివార్లలోని దుండిగల్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గౌడవెల్లి నుంచి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.