Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లెవుడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామంతపూర్ లో గల ఈజీ ప్లెవుడ్ గోదాంలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈజీ ప్లెవుడ్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంతో కాలి బూడిద అయింది ఈజీ ప్లెవుడ్ గోదాం. ఇక దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ ఘోర ప్రమాదంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.