Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చిలీ దేశంలోని క్విలాన్ గ్రామీణ ప్రాంతాల్లోని అడవిలో కార్చిచ్చు రాజుకుంది. చిలీలో రాజుకున్న మంటల్లో 13మంది సజీవ సమాధి అయ్యారు.9 బయోబియో, నబుల్ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చిలీ అడవుల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 35వేల ఎకరాల్లోని చెట్లు దహనం అయ్యాయి. ఈ అగ్నిప్రమాదం వల్ల వేడిగాలులు వీస్తున్నాయని అధికారులు చెప్పారు.
చిలీ రాజధాని నగరమైన శాంటియాగోకు దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలోని బయోబియో శాంటా జువానా పట్టణంలో 13 మంది మరణించారని చిలీ దేశ అధికారులు చెప్పారు. బ్రెజిల్, అర్జెంటీనా దేశాల సహాయంతో 63 విమానాలతో అగ్నిని ఆర్పేందుకు యత్నిస్తున్న చిలీ దేశ మంత్రి కరోలినా తోహా చెప్పారు. ఈ అగ్నిప్రమాదంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.