Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగిత్యాల
జగిత్యాల జిల్లాలో అనుమానాస్పద స్థితిలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు బావిలో పడి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం జలపతి రెడ్డి (40), ఇద్దరు కూతుళ్లు ప్రణిత్య(10), మధుమిత (9) శుక్రవారం శుభకార్యానికి వెళ్లి తిరిగిరాలేదు.
శనివారం ఉదయం మృతుడి సోదరుడు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా వ్యవసాయ బావిలో పడి ఉన్న జలపతి రెడ్డిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో జలపతి, ఇద్దరు కూతుర్ల మృతదేహాలను గుర్తించారు. ఈ క్రమంలోనే జలపతి వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్లి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియల్సి ఉంది.