Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని మొద్దుల గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళ వ్యవసాయ కూలీలు శనివారం ఆటో ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన సుమారు 18 మంది వ్యవసాయ కూలీలు నాటు వేసే నిమిత్తం ఆటోలో ప్రయాణిస్తున్నారు. నార్లాపూర్ గ్రామ సమీపంలో కూలీలు ప్రయాణిస్తున్న ఆటో వేగ నియంత్రణ కోల్పోయి ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో కూలీలు తీవ్రంగా గాయపడడమే కాకుండా సంఘటనస్థలిలో మల్లె పోయిన సునీత (35) వ్యవసాయ కూలీ మృతి చెందారు.
క్షతగాత్రులను వెంటనే ములుగు సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామంలో తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం కు తరలిస్తున్న క్రమంలో బానోతు జ్యోతి (35) కూడా మృతి చెందినట్లు తెలిపారు. చాలామందికి తీవ్రంగా గాయాలు, చేతులు విరిగినట్లు తెలుపుతున్నారు. క్షతగాత్రులను ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీ రాంచందర్ పరామర్శించి మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.