Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఢీల్లి
ఢీల్లి మద్యం కుంభకోణంలో ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీట్లో కేజ్రీవాల్ పేరు బయటపడిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంలో వచ్చిన రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని ఆప్ గత ఏడాది గోవాలో ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు తాము గుర్తించామని ఈడీ తన ఛార్జిషీట్లో తెలిపింది. ఈ తరుణంలో బీజేపీ ఆప్ సర్కారుపై విమర్శల దాడి పెంచింది. ఢీల్లికి చెందిన బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో ఆ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పేరు బయటకొచ్చిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు గద్దె దిగాలని ఆ పార్టీ ఢీల్లి యూనిట్ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతితో ఢీల్లిని చెదపురుగుల్లా తొలి చేస్తోందని, ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.