Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశానికి ఆదర్శంగా సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవ్వాళ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో కరెంట్ కష్టం లేదు. తాగునీటి తిప్పలు లేవు. సంక్షేమంలో ప్రభుత్వానికి తిరుగులేదు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉంది. తెలంగాణతో కేసీఆర్కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు.
మా ప్రభుత్వం కుటుంబపాలనే 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు మా కుటుంబమే. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నియామకాల కల సాకారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ 20గ్రామ పంచాయతీల్లో తొమ్మిది తెలంగాణలోనే ఉన్నాయి. పల్లెపల్లెకు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని తెలిపారు.
కేసీఆర్ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి. అక్కడ గుజరాత్లోని పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇస్తున్నారు. ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6మీటర్ల మేర పెరిగాయి. సాగునీటి రంగంలో తెలంగాణ గొప్ప విజయాలు సాధించిందని, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. జాతీయ తలసరి సగటు మాంసం వినియోగం దేశంలో 5 కేజీలు ఉంటే తెలంగాణలో 21 కేజీలు ఉందని పలు విషయాలను క్రోడీకరిస్తూ కేటీఆర్ ప్రసంగించారు.