Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మధ్యాహ్న భోజన వంట పని వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం పొందుతున్న వంట మనిషి, సహాయకులకు ఇకపై రూ.3000 ఇవ్వనున్నట్లు జీవోను జారీ చేసింది.
గతంలో వీరికి వెయ్యి రూపాయాల్లో రూ. 600 కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 చెల్లిస్తుంది. ఈ సారి కేంద్రం తన వాటాను పెంచకున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన వాటా కింద రూ. 2,400 అందజేస్తూ కేంద్రం ఇచ్చే నిధులతో కలుపుకుని మొత్తం రూ. 3000 అందజేయనున్నట్లు విద్యాశాఖ సెక్రటరీ కరుణ వాకాటి తెలియజేశారు. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54,201 మందికి మధ్యాహ్న భోజనం కింద వంట మనిషి, సహయకులకు పెంచిన వేతనం త్వరలో అందనుంది.