Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డును బ్రెక్ చేశాడు. ఈ ఫార్మాట్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. అయితే 211 మ్యాచుల్లోనే అతను ఈ ఘనత సాధించడం విశేషం. అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రికార్డును ఆండ్రూ టై బ్రేక్ చేశాడు. రషీద్ 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బాజ్లేను ఔట్ చేసి 300 వికెట్ సాధించాడు.
ఈ తరుణంలో పొట్టి క్రికెట్లో అతి తక్కువ మ్యాచుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 222 మ్యాచుల్లో 300 వికెట్లు తీశాడు. 2020లో రషీద్ ఖాన్, మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. సీపీఎల్ టోర్నీలో బార్బడోస్ ట్రిడెంట్కు ఆడిన అతను సెయింట్ లూసియా జౌక్స్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని ఔట్ చేయడంతో 300 వికెట్ల క్లబ్లో చేరాడు.