Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటా మాత్రం పెంచట్లేదు
నవతెలంగాణ - హైదరాబాద్
తమ వేతనాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేలకు పెంచినందుకు గానూ మధ్యాహ్న భోజన వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. తమ వేతనాల పెంపు కోసం కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేవలం పథకాల పేర్లు మార్చడానికే పరిమితమైందని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం పేరును పీఎం పోషణ గా మార్చిన కేంద్ర ప్రభుత్వం వర్కర్లకు ఇస్తున్న తన వాటాను మాత్రం పెంచలేదని విమర్శించారు. కానీ మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలను రూ.3 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కేవలం రూ. 600 మాత్రమే చెల్లిస్తుందని, మిగతా రూ. 2400 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని వివరించారు.