Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్యూఐ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వాళ్లను ఎక్కడ ఉంచారనే విషయం తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
ఈ తరుణంలో తన కుమారుడు కనిపించకపోవడంపై డీజీపీ అంజనీకుమార్ తో చర్చించేందుకు సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య రావు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అరెస్టయిన వారిలో రమ్యరావు కుమారుడు రితేశ్రావు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో లోపలికి వెళ్లకుండా అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రమ్య అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు అనుమతించడంతో కార్యాలయం లోపలికి వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లి అరెస్టు చేసినట్లు చూపించడం లేదంటూ రమ్యరావు ఆరోపించారు. తన కుమారుడి ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశారు.