Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో జిలిటెన్ స్టిక్స్ పట్టుబడటం కలవరానికి గురి చేస్తోంది. దాదాపు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురుని అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.