Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గృహిణి అద్యశ్యమైంది. ఎస్ఐ మల్లేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన మేకల రాజిరెడ్డి, సుహాసిని (27) ఎంఎన్‌రెడ్డి నగర్లోఉంటున్నారు.పాఠశాలనుంచి బాబును తీసుకురమ్మని సుహాసిని భర్తకు శనివారం ఫోన్‌చేసి చెప్పింది. స్కూల్ నుంచి బాబును తీసుకొని వచ్చిన భర్తకు ఇంట్లో ఉన్న కుమార్తె ఏడుస్తూ కనిపించింది. ఏమైందని కుమార్తెను అడగగా అమ్మ ఇంట్లో లేదని చెప్పింది. చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా భార్య ఆచూకీ తెలియలేదు. పేట్‌బషీరాబాద్ పోలీసులకు శనివారం రాజిరెడ్డి ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తుచేస్తున్నారు.