Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నేడు హైదరాబాద్ వేదికగా 'ర్యాల్-ఈ' పేరుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ జరగనుంది. ఇందులో 1,000 నుంచి 1,200 వరకు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ పాల్గొననున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు రూట్లలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. పీపుల్స్‌ప్లాజా నుంచి ఐమాక్స్ రోడ్ రోటరీ మీదుగా ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ కేసీపీ జంక్షన్-పంజాగుట్టు-ఎన్ఎఫ్సీఎల్-ఎస్ఎన్టీ జంక్షన్-సాగర్ సొసైటీ-కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా సైబరాబాద్ లిమిట్స్‌కు ఈవీ ర్యాలీ చేరుకుంటుంది. దీంతో పీపుల్స్ ప్లాజా నుంచి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.