Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ మోటార్ సైకిల్‌ను ట్రక్కు ఢీకొనడంతో శనివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఖరస్రోటా వంతెనపై, బింజర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సదర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్-ఇన్ఛార్జ్ మానస్ రంజన్ చక్ర తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆస్పత్రిగా తీసుకెళ్లగా.. అతను చనిపోయినట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, అతని పరిస్థితి విషమంగా ఉన్నందున కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నేతృత్వంలోని బీఆర్ఎస్లో ఇటీవల చేరిన మాజీ ఎమ్మెల్యే జాజ్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పార్టీ విలేకరుల సమావేశంలో పాల్గొనడానికి దాస్ రాష్ట్ర రాజధానికి వెళుతున్నట్లు బీఆర్ఎస్ ఒడిశా వ్యవస్థాపక సభ్యుడు అక్షయ కుమార్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జాజ్‌పూర్ మాజీ ఎంపీ అనాది దాస్ కుమారుడైన అర్జున్ చరణ్ దాస్ 1995- 2000 మధ్య బింజర్‌పూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.