Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ పేలుళ్లకు కుట్రపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీచేసింది. గతేడాది దసరా సందర్భంగా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని జావేద్ గ్యాంగ్ కుట్ర పన్నింది. దీనిని నగర పోలీసులు ఛేదించారు. అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను అరెస్టు చేసి.. వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్ లు, రూ.5.50 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ జాహెద్‌కు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని గుర్తించారు. పాకిస్థాన్ నుంచి నేపాల్మీదుగా మనోహరాబాద్‌కు హ్యాండ్ గ్రనేడ్లు తరలించారని పోలీసులు వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.