Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. ఈ కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం కటాఫ్‌గా నిర్ణయించింది.