Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దుబాయ్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ఢీల్లిలో జన్మించిన ముషారఫ్, దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.
ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఆ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. పాక్ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేసిన ముషారఫ్ 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.