Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి పై కేసు నమోదైంది. భార్య ఆండ్రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో, తన కుమారుడి (12)తో అకారణంగా గొడపపడి, తన తలపై బలంగా కొట్టాడని ఆమె ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఇంతవరకూ ఎలాంటి అరెస్టు జరగలేదు.
అయితే ఎలాంటి కారణం లేకుండానే నాతో, నా కుమారుడితో ఆయన గొడవపడ్డాడు. నచ్చచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. మాపై దాడికి దిగాడు. కుకింగ్ పాన్ హ్యాండిల్‌ను నాపై విసిరాడు. బ్యాట్ తీసుకుని బాదాడు. దాంతో నా కొడుకుని తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాను అని వినోద్ కాంబ్లి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 324 (ప్రమాదకర ఆయుధాలతో దాడి), 504 (అవమానించడం) కింద పోలీసులు కాంబ్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.