Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే) నేత ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పై నిప్పులు చెరిగారు. పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం మాట్లాడుతూ వర్లీ నియోజకం వర్గం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. శివసేనపై తిరుగుబాటు చేసిన ఇతర ఎమ్మెల్యేలకు సైతం ఆదిత్య ఠాక్రే ఇదే తరహా సవాల్ విసిరారు. తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలన్నారు. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా ప్రజల మద్దతు కోరాలన్నారు.
వర్లీ నుంచి నేను రాజీనామా చేస్తాను. నాపై పోటీకి సిద్ధమవ్వాలని ఈ రాజ్యాంగ విరుద్ధ సీఎంకు సవాల్ విసురుతున్నాను. ఆయన ఎలా గెలుస్తారో నేనూ చూస్తాను. తిరుగుబాటు చేసిన 13 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలకు కూడా అదే సవాల్ విసురుతున్నాను. రాజీనామా చేసిన మళ్లీ పోటీ చేయండి. గెలుస్తారేమో చూద్దాం అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.