Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్ర మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధానం నుంచి సోమవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితర ముఖ్యనేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అయితే.. రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందని అన్నారు. పార్టీ నాయకులంతా దీన్ని సమన్వయంతో అమలు పరుస్తారని పేర్కొన్నారు. కాగా.. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది రోజులపాటు సాగే యాత్రలో తాను పాల్గొంటున్నట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతోపాటు బందోబస్తు కల్పించాలంటూ ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎస్పీ గౌస్ ఆలంను కోరారు.