Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బ్యాంకులో లోన్ కావాలంటే అంత ఈజీ కాదు. వివిధ రకాల డాక్యుమెంట్లు సమర్పించాలి, తగిన ష్యూరిటీ ఇవ్వాలి. అవసరమైతే స్థిరాస్తులను తనఖా పెట్టాలి. ఇన్ని చేసినా మన సిబిల్ స్కోరు సరిగా లేకుండా లోన్ మంజూరు కావడం కష్టమే. బ్యాంకులు మన రుణ చరిత్రను పరిశీలించే లోన్ ఇవ్వనంటే చేసేదేమీ లేదు. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ మాత్రం తనకు లోన్ మంజూరు కాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. కోపంతో సంబంధిత బ్యాంకు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 3న బ్యాంక్ ఆఫ్ ఇండియా నడియాడ్ బ్రాంచ్‌లో ఈ దాడి ఘటన జరిగింది. దాంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దాడికి పాల్పడిన కస్టమర్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.