Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తమ దృష్టంతా టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న తొలి గేమ్‌పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ప్రస్తుతం జట్టంతా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంపై కాకుండా పాక్ మ్యాచ్‌పైనే ఫోకస్ పెట్టిందని ఆమె చెప్పింది. ‘మహిళల ప్రీమియర్ వేలానికి ముందు రోజు మాకు పాక్‌తో కీలకమైన మ్యాచ్ ఉంది. మాకు అన్నింటికంటే వరల్డ్ కప్ చాలా ముఖ్యమైనది. ఐసీసీ ట్రోఫీ నెగ్గడంపై అందరం దృష్టి సారించాం. మేమంతా ఎంతో పరిణితితో ఉన్నాం. ఒక ప్లేయర్‌గా ఏది ముఖ్యమో మాకు తెలుసు’ అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వెల్లడించింది.