Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశంలో రుణ యాప్‌ల ఆగడాలు, బెట్టింగ్ యాప్‌ల పర్యవసనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. 138 బెట్టింగ్ యాప్స్, 94 రుణ యాప్‌లపై నిషేధం, మరికొన్నింటిని బ్లాక్ చేయాలనే నిశ్చయించింది. మొత్తం 232 యాప్స్‌పై తక్షణ, అత్యవసర ప్రాతిపదికన ఈ చర్యకు సిద్ధమైనట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఈ నిర్ణయం జరిగిందని, యాప్‌ల బ్లాక్‌కు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కింద భారత సార్వభౌమత్వం, సమగ్రత పట్ల పక్షపాతంగా వ్యవహరించే ఉద్దేశాలను ఈ యాప్‌లలో గుర్తించడంతో ఈ చర్య తీసుకున్నట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి.