Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాందేడ్
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ను విస్తరించే దిశగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించింది బీఆర్ఎస్. ఈ సభకు నాందేడ్ పట్టణంతో పాటు.. సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. ఈ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటన చేశారు. అయితే ఒంటరిగా పోరాటం చేస్తారా..? లేకుంటే ఏదైనా ప్రాంతీయ పార్టీతో కలిసి ముందుకెళ్తారా..? అనే విషయంపై మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు మహారాష్ట్రకు చెందిన నేతలు ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్కరూ కేసీఆర్‌ను కలవలేదు.. బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించలేదు కూడా. అయితే నాందేడ్ సభ రోజు మాత్రం మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు.. త్వరలోనే గ్రామ గ్రామాన బీఆరెస్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల్లోనే గ్రామ కమిటీలు నియమిస్తాం. త్వరలో విదర్భలోనూ పర్యటిస్తాను.