Authorization
Fri May 16, 2025 09:48:42 pm
నవతెలంగాణ - మూసాపేట
జల్సాలకు అలవాటు పడ్డ ఐదుగురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నగరంలో డ్రగ్స్‌ను విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌రావు, ఏసీపీ చంద్రశేఖర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన దాసరి హరికృష్ణ, నెమలికంటి పవన్‌కుమార్, జనగాం కిరణ్, రఘునందన సాంబమూర్తి , సాయికుమార్ అనే ఐదుగురు స్నేహితులు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారని తెలిపారు. బెంగుళూర్‌లో ప్రైవేటు జాబ్ చేస్తున్న సాయికుమార్ అనే యువకుడు బెంగళూరులో నైజీరియాకు చెందిన ప్రధాన డ్రగ్ సప్లయిర్ ఆలీతో పరిచయం అయ్యాడు. ఆలీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన సాయికుమార్ హైదరాబాద్‌కు తీసుకువచ్చి స్నేహితులతో విక్రయిస్తున్నారని తెలిపారు. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు బేబిపాండ్ వద్ద మాదాపూర్ ఎస్‌ఓటీ , కూకట్‌పల్లి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా కన్పించిన ఐదుగురిని పట్టుకుని తనిఖీలు చేశారు. దీంతో వారి వద్ద 18గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించింది. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని వారిని అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.