Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని క్వెట్టాలో స్టేడియం సమీపంలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వంటి వారు స్టేడియంలోనే ఉన్నారు. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని వెంటనే డ్రెస్సింగ్ రూముకు తరలించి భద్రత కల్పించారు. స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియానికి కొన్ని మైళ్ల దూరంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని డ్రెస్సింగ్ రూముకు తరలించి భద్రత కల్పించారు.
క్వెట్టాలోని నవాబ్ అక్బర్ బుగ్టి స్టేడియంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుండగా పోలీస్ లైన్స్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు ముగిశాయని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ బాధ్యత వహించింది. అది తమ పనేనని ప్రకటించింది. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడినట్టు తెలిపింది.