Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకిని కాదని, రైతు పక్షపాతినని కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను ఆదరించాలని పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర నేతలను ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. గోదావరిలో 2 నుంచి 3 వేల టీఎంసీల వరద పారుతుంది. గోదావరి నుంచి వృధాగాపోతున్న నీళ్లను సద్వినియోగం చేసుకోవాలని చెప్పాం. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి, గోదావరి జలాల సమస్య పరిష్కరించలేదా..? మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. తాము మహారాష్ట్రకు హృదయపూర్వకంగా నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై ఏకంగా పుస్తకాలే వచ్చాయి.. పాలకులే అనుసరించడం లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు పేరుతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలతో డ్రామా ఆడారు. అసలు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వివాదమే లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఇక వివాదం ఎక్కడిది? అని కేసీఆర్ అడిగారు.