Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రజల డబ్బుతో నిర్మించిన నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించడం అన్యాయమని.. అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరారు. జాతి అభివృద్ధి కోసం పౌరులు చెల్లిస్తున్న పన్నుల సొమ్మును దుర్వియోగం చేస్తూ.. అప్పటికే ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరిట కూల్చి కొత్తది నిర్మించారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.610 కోట్లతో కొత్తగా నిర్మించిన భవనాన్ని తన పుట్టినరోజునాడు ప్రారంభించడం ద్వారా సీఎం వ్యక్తిగత ప్రచారం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్లో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), సీఎంవోను ప్రతివాదులుగా చేర్చారు. పిల్ ఇంకా బెంచ్ పైకి రాకుండానే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ బర్త్డే రోజే ప్రారంభించాలని చూస్తే సచివాలయాన్ని ముట్టడిస్తామని కేఏ పాల్ హెచ్చరించారు.