Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో విషాదం అలుముకున్నది. రవికిషన్ అన్న రామ్ కిషన్ శుక్లా (53) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరణించినట్లు పేర్కొన్నారు. సోదరుడి మరణం నేపథ్యంలో నటుడు ముంబయికి బయలుదేరాడు. ఆయన మృతికి పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. రామ్ కిషన్ శుక్లా ముంబయిలో ఉంటూ రవికిషన్ ప్రొడక్షన్ పనులు చేసుకునేవారు.
సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. దీంతో వెంటనే నానావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. రవికిషన్ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. కిషన్ శుక్లా పెద్దవాడు కాగా, రవికిషన్ రెండోవాడు. కిషన్ శుక్లాకు కొడుకు ఉండగా.. భార్య ఇప్పటికే మృతి చెందింది. ఇదిలా ఉండగా.. రవికిషన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రంలో.. ‘మద్దాలి శివారెడ్డి’ పాత్ర గుర్తింపు పొందారు. ఇటీవల గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం విధితమే.