Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చైనా
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హునాన్‌లో ఒకేసారి పలు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఆదివారం ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్జౌ హైవేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకొవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 66 మంది గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ పోలీస్ శాఖను తెలిపింది. పలువురు తీవ్రంగా గాయపడగా.. వారందరినీ ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందిన తర్వాత ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ టీంను సంఘటనా స్థలానికి పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.