Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రేపు ఉదయం 10.30 గంటలకు ఉభయసభల్లో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభలో మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతారు. మండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో హరీష్‌రావు పూజలు చేసి అనంతరం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. ఇది ఎన్నికల బడ్జెట్ కావడంతో రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, వాటి ప్రయోజనాలు ఆ వర్గాలకు అందకపోతుండడంతో ఈసారైనా తమ ఆకాంక్షలు నెరవేరతాయా.. అని వారు నిరీక్షిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసమంటూ ప్రవేశపెట్టిన దళితబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాలను చూపిస్తూ.. మిగతా పథకాలన్నింటినీ ప్రభుత్వం అటకెక్కించిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో 2023-24 బడ్జెట్లోనైనా సంక్షేమానికి నిధులను పెంచుతారా లేదా అన్న చర్చ మెదలైంది.