Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జేఈఈ మెయిన్స్-1 పరీక్ష ఫలితాలను ఈ వారంలో ప్రకటించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పరీక్షకు సంబంధించిన 'కీ'ని విడుదల చేసిన అధికారులు వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ను రెండు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి విడతగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా సుమారు 8.22 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీటి ఫలితాలు వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కాగా జేఈఈ మెయిన్స్-2 పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 12 మధ్య నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.