Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టర్కీలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (+ఖ్గీ) తెలిపింది. నూర్దాగీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు పేర్కొన్నది. దీని ప్రభావంతో సైప్రస్, గ్రీస్, జోర్డాన్, లెబనాన్లో కూడా ప్రపంపనలు చోటుచేసుకున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, భూకంప ప్రభావంతో జరిగిన నష్టానికి సంబంధిచి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.