Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీబీఐ విచారణ జరపాలని నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వీడియోలను, వివరాలను బయటపెట్టారన్న ఒకే ఒక కారణంతో కేసును సీబీఐకి అప్పగించడం తగదని దవే వాదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న సీజే ధర్మాసనం గత నెల 30న తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్థిస్తుందా? లేకపోతే సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.