Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. విద్యుత్ సరఫరాలకు సంబంధించి అసలు రూ.3441.78 కోట్లు, వడ్డీ రూ.3,315.14 కోట్లు కలిపి మొత్తంగా రూ.6,756.92 కోట్లు తెలంగాణ డిస్కంలు చెల్లించాలని 2022లో కేంద్రం ఆదేశించిందని చెప్పారు. అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, హోంశాఖను ఎన్నిసార్లు కోరినప్పటికీ స్పందించలేదన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్షకు ఇది మరో ఉదాహరణ అని అన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014-15లో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన రూ.495 కోట్లు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు బాధ్యతా రాహిత్యంగా ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశాయని విమర్శించారు. ఈ అన్యాయాన్ని సవరించాలని ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర పెడచెవిన పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధంగా కేంద్ర సహకారం లేకపోయినా గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించాన్నారు.