Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఢీల్లి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గతేడాది డిసెంబరు 13న ఈ అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనల విషయంలో సుప్రీం, కేంద్రానికి మధ్య ఇటీవల అభిప్రాయభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తరుణంలో ఈ సిఫార్సులకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గత శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ తరుణంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు చేరారు. వారీలో తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్తో పాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వీరితో ప్రమాణం చేయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుకుంది.