Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఇండియన్ సింగర్ రిక్కీ కేజ్ ఈ ఏడాది గ్రామీ అవార్డు గెలిచాడు. డివైన్ టైడ్స్ ఆల్బమ్‌కు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ క్యాటగిరీలో అతని ఆల్బమ్ పోటీపడింది. బ్రిటీష్ రాక్‌బ్యాండ్‌లో డ్రమ్ము వాయించే స్టీవార్ట్ కోప్‌ల్యాండ్‌తో కలిసి రిక్కీ అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో గ్రామీ అవార్డును మూడుసార్లు గెలుచుకున్న తొలి ఇండియన్‌గా కేజ్ రికార్డును కైవసం చేసుకున్నారు. అవార్డు గెలిచిన తర్వాత కేజ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ అవార్డు మూడవసారి గెలుచుకోవడం విశేషం.