Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా.. సానియా కెరీర్ తనలో కొత్త స్ఫూర్తిని రగిలించిందని నేడు ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు. టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన సానియా మీర్జా గత నెల తన చివరి గ్రాండ్‌స్లామ్ ఆడింది.
ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్ వరకు వెళ్లి ఓటమితో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించింది. ఆ తరుణంలో సానియా మాట్లాడుతూ పోటీతత్వం అనేది నా రక్తంలోనే ఉంది. నేను ఎప్పుడు కోర్టులో అడుగుపెట్టినా గెలవాలనే ఆడుతా. అది నా చివరి గ్రాండ్‌స్లామ్ అయినా లేదా చివరి సీజన్ అయినా సరే..! అని తెలిపింది. ఈ సందేశాన్ని ఆనంద్ మహీంద్రా సోమవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ఆమె(సానియా) తన కెరీర్‌ను ఎలా ప్రారంభించిందో అలాగే ముగించింది. విజయం సాధించాలనే పట్టుదల ఆమెలో ఏ మాత్రం తగ్గలేదు. నా కెరీర్లో ఈ దశలోనూ రాణించాలనే కోరికను నాలో సజీవంగా ఉంచుకునేలా ఆమె జీవితం గుర్తుచేసింది. ఆమె నా మండే మోటివేషన్ అని మహీంద్రా రాసుకొచ్చారు.