Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్తాంబుల్
7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం టర్కీ, సిరియా దేశాలను కుదిపేసింది. సైప్రస్, లెబనాన్ లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఆ తరుణంలో ఇప్పటివరకూ 7 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు భూకంపం వచ్చాక ఇప్పటివరకూ మొత్తం 40 సార్లు భూమి కంపించింది.
దక్షిణ టర్కీలోని గజియాన్టెప్ సమీపంలో నరుద్గీకి 23 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూజి జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్మెంట్లు కూలిపోయాయని, దీంతో భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తుంది. ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ భూకంపం తర్వాత హైఅలర్ట్ ప్రకటించినట్టు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. సిప్రస్, టర్కీ, గ్రీస్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యూకే, ఐరాక్, జార్జియాలోనూ ప్రకంపనలు సంభవించాయి. సిరియాలోని అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ క్రమంలో మరణాల సంఖ్య దాదాపు 1600 దాటినట్లు, దీనిలో గాయపడ్డవారిలో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా సమాచారం.