Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఢీల్లి
నేడు లోక్సభలో గిరిజన విశ్వవిద్యాలయాలు ప్రసక్తి వచ్చింది. ఈ క్రమంలో దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులు ఉన్నారని, దేశంలో ప్రస్తుతం రెండు గిరిజన విశ్వవిద్యాలయాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. అవి ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఒకటి, మధ్యప్రదేశ్లో మరొకటి ఉన్నాయని ఈ రెండు యూనివర్సిటీల్లో 523 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు కేంద్ర విద్యాశాఖ లోక్సభలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాద ఉందన్న కేంద్రం. విశ్వవిద్యాలయాల ఏర్పాటు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణీత ప్రమాణాలేవీ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు బీఆర్ ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.