Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్వహించే పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 13,404 పోస్టులకు భర్తీకి దశల వారీగా మార్చి 6వరకు పరీక్షలు జరగనుండగా ఈ నెల 7న అసిస్టెంట్ కమిషనర్, 8న ప్రిన్సిపల్, 9న వైస్ ప్రిన్సిపల్ & పీఆర్టీ (మ్యూజిక్) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ అడ్మిట్ కార్డులను kvsangathan.nic.in సైట్ ద్వారా పొందవచ్చు.